విశాఖపట్నం జిల్లాలో మరో అందమైన టూరిస్ట్ ప్రదేశము " కొండకర్ల ఆవ" సరస్సు
ఇది రాష్ట్రంలో కొల్లేరు సరస్సు తర్వాత రెండవ పెద్ద మంచినీటి సరస్సు.
ఇది రాష్ట్రంలో కొల్లేరు సరస్సు తర్వాత రెండవ పెద్ద మంచినీటి సరస్సు. ఒక వైపు కొండలు, వేరొక వైపు కొబ్బరిచెట్లు ఆవకు ప్రత్యేక అందాన్ని చేకూర్చుతున్నాయి. సరస్సు లోని వివిధ రకాల నీటి మొక్కలు, రకరకాల పక్షులు, ప్రకృతివీక్షకులకు కనువిందు కలగజేస్తాయి. నవంబరు, డిసెంబరు నెలలలో సైబీరియా మొదలగు అనేక దేశాల నుండి పక్షులు ఇక్కడకు వలస వస్తాయి. అందమైన విదేశీ పక్షులు సందర్శకులను ఆకట్టుకొంటాయి. ఈ సరస్సు అందానికి ముగ్ధులైన ఫ్రెంచి వారు ఆవకు సమీపంలో ‘ప్రెంచ్ భవనాన్ని’నిర్మించారు.