పదమూడేళ్లకే అంతరిక్ష పరిశోధనలు... గ్రహశకలాలను కనుగొన్న నిడదవోలు యువతి
గుంటూరు: అంతరిక్షంలో గ్రహ శకలం ఆనవాళ్లను కనుగొన్న 8వ తరగతి విద్యార్థిని కైవల్యారెడ్డి శుక్రవారం హోంమంత్రి సుచరితని కలిశారు.
గుంటూరు: అంతరిక్షంలో గ్రహ శకలం ఆనవాళ్లను కనుగొన్న 8వ తరగతి విద్యార్థిని కైవల్యారెడ్డి శుక్రవారం హోంమంత్రి సుచరితని కలిశారు. బ్రాడిపేటలోని నివాసం వద్ద హోంమంత్రిని కైవల్యతో పాటు తల్లిదండ్రులు శ్రీనివాస్ రెడ్డి, విజయలక్ష్మి, తమ్ముడు తపస్వి రెడ్డి లు కలిశారు. ఇటీవల మార్స్ జూపిటర్ గ్రహాల మధ్యలో ఉన్న ఒక గృహ శకలాన్ని కైవల్యా రెడ్డి కనిపెట్టింది. స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్ అంబాసిడర్ బృందంలో కైవల్య రెడ్డి తో పాటు తమ్ముడు తపస్వి రెడ్డి సెలెక్ట్ అయి ఈ ఘనత సాధించారు. దేశ వ్యాప్తంగా ఆస్ట్రోనమి పై నిర్వహించే ప్రచారంతో పాటు ఆంద్రప్రదేశ్ కిడ్స్ క్లబ్ ఫౌండేషన్ తరుపున వీరిద్దరూ విధులు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన నియామక పత్రాలను, మెడల్స్ ను హోంమంత్రి సుచరితకి కైవల్య కుటుంబం చూపించారు.