Asianet News TeluguAsianet News Telugu

కత్తి మహేష్ ఆరోగ్యం విషమంగానే ఉంది: వైద్యులు

నెల్లూరు: చెన్నై-- కలకత్తా రహదారిపై శనివారం తెల్లవారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు కత్తి మహేష్ గాయపడిన విషయం తెలిసిందే. 

నెల్లూరు: చెన్నై-- కలకత్తా రహదారిపై శనివారం తెల్లవారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు కత్తి మహేష్ గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం నెల్లూరులోని మెడికవర్ కార్పోరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో మహేష్ తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి.స్పెషల్ ఐసోలేషన్ లో వెంటిలేటర్ మీద ఉంచి మహేష్ కు డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని వైద్యులు చెప్పారు. కత్తి మహేష్ పరిస్థితి విషమంగానే ఉందని అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మహేష్ తో పాటు డ్రైవర్ కూడా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో కత్తి మహేష్ ను పోలీసులు, హైవేపై గస్తీ చేస్తున్న సిబ్బంది గుర్తు పట్టారు. వెంటనే మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. కత్తి మహేష్ బంధువులు, స్నేహితులు ఆస్పత్రికి చేరుకున్నారు. మహేష్ ఆరోగ్య పరిస్థితిపై అనుచరులు ఆరా తీస్తున్నారు.