Asianet News TeluguAsianet News Telugu

అబద్దాలు, కట్టుకథలు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తో చంద్రబాబు అరెస్ట్..

పల్నాడు జిల్లా : ఏపీలోని పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో నిర్వహిస్తున్న ‘బాబుతో నేను’ దీక్షాశిబిరంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

పల్నాడు జిల్లా : ఏపీలోని పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో నిర్వహిస్తున్న ‘బాబుతో నేను’ దీక్షాశిబిరంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఈరోజుకి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి 8 రోజులు, అక్రమంగా, అవమానకర పరిస్థితుల్లో అరెస్టు జరిగిందని అన్నారు. 

అబద్దాలు, కట్టుకథలు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తో కట్టుకథలతో రిమాండ్ రిపోర్ట్ రాసి కోర్టులో పెట్టారు. డబ్బు ఎక్కడికెళ్ళిందో తెలియదు, కానీ అవినీతి జరిగిందని చంద్రబాబునాయుడు మీద కేసు పెట్టారు. పీ.వీ రమేష్ అవినీతి జరగలేదన్నారు. చంద్రబాబు నేను తప్పు చేయలేదు తప్పు జరగలేదని స్టేట్మెంట్ ఇచ్చారు.. అని చెప్పుకొచ్చారు. 

స్కిల్ డెవలప్మెంట్ కింద రెండు లక్షల పదమూడు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాం. 75 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. సిబి సిఐడి చెప్పేదానిలో వాస్తవం లేదు. డిజైన్ టెక్ మా పేరు చెప్పుకొని చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్తుంది అని మండిపడ్డారు.

Video Top Stories