విశాఖలో గీత కార్మికుల ఆందోళన... సిపిఐ సంపూర్ణ మద్దతు

విశాఖపట్నం : తమ ఇంటి స్థలాలను కబ్జాదారుల నుండి కాపాడాలంటూ ఆందోళనకు దిగిన విశాఖపట్నం గీత కార్మికులకు సిపిఐ మద్దతుగా నిలిచింది. 

First Published Feb 27, 2023, 3:43 PM IST | Last Updated Feb 27, 2023, 3:43 PM IST

విశాఖపట్నం : తమ ఇంటి స్థలాలను కబ్జాదారుల నుండి కాపాడాలంటూ ఆందోళనకు దిగిన విశాఖపట్నం గీత కార్మికులకు సిపిఐ మద్దతుగా నిలిచింది. మధురవాడలో గతంలో గీత కార్మికులకు కొనుగోలు చేసి గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారని... వీరిలో కొందరు ఆర్థిక అవసరాలతో తమ స్థలాలను అమ్ముకున్నారు. అయితే ప్రస్తుతం 20 సెంట్ల స్థలంలో గీత కార్మిక కుటుంబాలు నివాసముంటున్నారు. విలువైన ఈ భూమిపై కన్నేసిన పోతిన రమణ అనే వ్యక్తి మాజీ కార్పోరేటర్ పోతిన హనుమంతరావు సహకారంతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కబ్జా చేసాడని గీత కార్మికులు ఆరోపిస్తున్నారు. తమ భూమిని కబ్జాదారుల నుండి కాపాడి న్యాయం చేయాలంటూ గీత కార్మికులు జివిఎంసి వద్దగల గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. వీరికి సిపిఐ జిల్లా కార్యదర్శి పైడిరాజుతో పాటు ఇతర నాయకులు మద్దతు తెలిపారు.