2029లో 11సీట్లు కూడా రావు: జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగంపై నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ప్రశంసలు కురిపించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆమె ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైఎస్ జగన్ ప్రవర్తన అసభ్యకరంగా ఉందని ఆక్షేపించారు. ప్రజల దృష్టిలో ఓ జోకర్‌గా మిగిలిపోయారన్నారు.