రైతు దేవోభవ... విస్సన్నపేటలో జనసేన నాయకుల నిరసన

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద జనసేన పార్టీ నాయకులు 'రైతు దెవోభవ' పేరిట నిరసన కార్యక్రమం చేపట్టారు.

Share this Video

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద జనసేన పార్టీ నాయకులు 'రైతు దెవోభవ' పేరిట నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలోని రైతుల సమస్యల పరిష్కారినికి డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే విస్సన్నపేట మండల అధ్యక్షుడు షేక్ యాసిన్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. 

ఈ సందర్భంగా యాసిన్ మాట్లాడుతూ... రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వమే ముందుకురావాలని సూచించారు.  గిట్టుబాటు ధర కల్పిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. అలాగే రైతుకూలీలను కూడా ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కు అందజేసారు జనసేన నాయకులు. 

Related Video