ఓటమి ఎరుగని ధీరుడు జగన్.. నారా లోకేశ్‌కి అంబటి రాంబాబు వార్నింగ్ | Asianet News Telugu
మంత్రి నారా లోకేష్ అధికార గర్వంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేష్ భ్రమల్లో బతకుతున్నాడన్నారు. ప్రజాధరణ ఉన్న వైయస్ జగన్‌ను విమర్శించే అర్హత లోకేష్‌కు లేదని అన్నారు.