
క్యారెక్టర్ ఉండాలి: విజయసాయి రెడ్డి పార్టీ వీడటంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పార్టీని వీడటంపై వైఎస్ జగన్ స్పందించారు. వైసీపీకి రాజ్యసభ్యలో 11 మంది సభ్యులు ఉంటే ముగ్గురు పోయారని.. విజయసాయి రెడ్డితో కలిపితే నలుగురు అయ్యారన్నారు. రాజకీయాల్లో క్యారెక్టర్, క్రెడిబిలిటీ ముఖ్యమని చెప్పారు. కార్యకర్తలు గొప్పగా చెప్పుకొనేలా నాయకుడు ఉండాలని.. ప్రలోభాలకు లొంగిపోకూడన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో జగన్ మాట్లాడారు.