151సీట్లు పాయే.. సొంత చెల్లిపాయే.. జగన్ రెడ్డి బుర్ర పాయే: Panchumarthi Anuradha | Asianet Telugu
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసి అన్ని రంగాలను అథ: పాతాళంలోకి నెట్టేసిన జగన్ రెడ్డి నేడు కూటమి ప్రభుత్వం విషం చిమ్మడం విడ్డూరంగా ఉందని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు. చెప్పిన అబద్ధాన్నే మరలా మరలా చెప్పడం, అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించడంలో జగన్ రెడ్డి ఆరితేరాడని ఆమె ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.