
ఏపీ బిహార్ అవుతోంది.. అయ్యా మీరు చేసేది న్యాయమేనా?: YS జగన్ రాప్తాడు పర్యటన
కక్షా రాజకీయాలు, అక్రమ కేసులు, అరెస్టులతో ఆంధ్రప్రదేశ్ బిహార్‌లా తయారు అవుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో ఆయన పర్యటించారు. ఇటీవల దాడిలో మరణించిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో మాట్లాడారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.