Asianet News TeluguAsianet News Telugu

శవయాత్రకు దారేది... మృతదేహంతో రోడ్డుపైనే పడిగాపులు

చిత్తూరు జిల్లా సత్యవేడు బుచ్చినాయుడు కండ్రిగ మండలం కొత్తపాలెంలో అమానుష ఘటన చోటుచేసుకుంది.

Feb 24, 2021, 4:22 PM IST

చిత్తూరు జిల్లా సత్యవేడు బుచ్చినాయుడు కండ్రిగ మండలం కొత్తపాలెంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ మృతదేహాన్ని తమ పొలాల్లోంచి తీసుకెళ్లనివ్వకుండా కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. అయితే స్మశానానికి వెళ్లడానికి మరో మార్గం లేక మహిళ శవాన్ని అక్కడే రోడ్డుపైనపెట్టి కుటుంబసభ్యులు, బంధువులు ఎదురుచూడాల్సి వచ్చింది. దాదాపు 2గంటలపాటు గ్రామ పొలిమేరలోనే మహిళ మృతదేహంతో పడిగాపులు పడ్డారు. 

స్మశానానికి దారి  లేక ఎవరు మరణించినా ఇదే తంతుగా మారిందని... తరతరాలుగా ఇలాగే అవస్థలు పడుతున్న కొత్తపాలెం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాము ఎన్నిసార్లు విన్నవించుకున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు.