పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు.. వాల్తేరు డివిజన్ వినూత్న ప్రయోగం..
భారతీయ రైల్వే, వాల్తేరు డివిజన్ లో ఓ వినూత్న ప్రయోగం జరిగింది.
భారతీయ రైల్వే, వాల్తేరు డివిజన్ లో ఓ వినూత్న ప్రయోగం జరిగింది. వాతావరణ కాలుష్యాన్ని నివారించే దిశగా అడుగులు ముందుకు పడ్డాయి. వాల్తేరు డివిజన్ లో సిబ్బందికోసం, రైల్వే అవసరాల కోసం ఇప్పటివరకు 50 డీజిల్ ఆటోలు వాడుతున్నారు. ప్రస్తుతం వీటి స్థానంలో ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రికల్ ఆటో రిక్షాలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. మొదటి విడతగా నాలుగు వాహనాలతో మొదలుపెట్టారు.