Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... నరసరావుపేటలో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ

నరసరావుపేట : భారత ఆర్మీలో పరిమిత కాలానికి సేవలందించేలా అగ్నవీర్ నియామకాలను చేపడుతున్న విషయం తెలిసిందే. 

First Published Aug 16, 2023, 5:27 PM IST | Last Updated Aug 16, 2023, 5:27 PM IST

నరసరావుపేట : భారత ఆర్మీలో పరిమిత కాలానికి సేవలందించేలా అగ్నవీర్ నియామకాలను చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో  భాగంగానే ఈ నెల 20 నుండి 26వ తేదీ వరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో లో  అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ ప్రకటించారు. జిల్లా క్రీడా ప్రాంగణంలో ఈ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం కల్పించారు. ఏపీలోని 13 జిల్లాల నుండి సుమారు పదివేల మంది ఈ రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉందన్న జిల్లా కలెక్టర్ తెలిపారు.