పల్నాడు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ... వేలాదిగా పాల్గొన్న పల్నాడు వాసులు.
పల్నాడులో పల్నాడు జిల్లా సాధన సమితి భారీ ర్యాలీ నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ భారీ యాత్ర జరిగింది. పిడుగురాళ్లలో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీకి వేలాదిగా పల్నాడు వాసులు తరలివచ్చారు. పిడుగురాళ్ల ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే యరపతినేని మాట్లాడుతూ ... పల్నాడు జిల్లాకు గురజాలను హెడ్ క్వార్టర్ చేయాలని, నరసరావుపేటను హెడ్ క్వార్టర్ గా ప్రకటిస్తే అనేక సమస్యలు వస్తాయని అన్నారు. పల్నాడుకు 900 ఏళ్ల విశిష్ట చరిత్ర ఉందని, ఇప్పటికే ప్రభుత్వం నియమించిన కమిటికి పలు డిమాండ్లు వినిపించామని, పల్నాడు అభివృద్ధి గురజాల హెడ్ క్వార్టర్ తోనే సాధ్యం అని అన్నారు.