Asianet News TeluguAsianet News Telugu

శ్రీశైలం ఆలయంలో మరో భారీ కుంభకోణం.. టెక్నాలజీతో గోల్ మాల్..

శ్రీశైలం క్షేత్రంలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 

శ్రీశైలం క్షేత్రంలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కొంతమంది అక్రమార్కులు భక్తుల సొమ్ములు కాజేశారు. రూ.150 రూపాయల శీఘ్ర దర్శనం కౌంటర్లో రూ.కోటి 80 లక్షల రూపాయలు మాయమయ్యాయి. పదిహేను వందల రూపాయల అభిషేకం టికెట్లలో రూ. 50 లక్షలు మాయమయ్యాయి. డొనేషన్స్ కౌంటర్లలో కోటి రూపాయల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు వసతి సదుపాయం కౌంటర్లో రూ.50 లక్షల అవినీతి జరిగింది. అటు టోల్ గేట్, పెట్రోల్ బంకుల నిర్వహణలో మరో రూ.40 లక్షలు, రూ.500 రూపాయల టిక్కెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టికెట్లలో మరో 50 లక్షల రూపాయలు దుర్వినియోగం జరిగింది.  భారీ ఎత్తున అవినీతి జరిగింది  నిజమేనని, ప్రభుత్వానికి నివేదిక తయారు చేస్తున్నాం అని ఆలయ ఈవో కె.ఎస్.రామారావు అని తెలిపారు. ఈ ఘటన మీద దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు.