సింధు స్నానాల కోసం హంసలదీవికి పోటెత్తిన భక్తులు...
అవనిగడ్డ : కృష్ణా నది బంగాళాఖాతంలో కలిసే హంసలదీవి వద్ద భక్తులు నేడు సింధూ స్నానాలు ఆచరిస్తున్నారు.
అవనిగడ్డ : కృష్ణా నది బంగాళాఖాతంలో కలిసే హంసలదీవి వద్ద భక్తులు నేడు సింధూ స్నానాలు ఆచరిస్తున్నారు. పవిత్ర సంగమం వద్ద మాఘ శుద్ధ పౌర్ణమి రోజు స్నానాలు ఆచరిస్తే సర్వపాపాలు హరించుకుపోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో ఇవాళ ఏపీ, తెలంగాణ నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి భక్తులు హంసలదీవికి చేరుకున్నారు. దీంతో తీరప్రాంతం భక్తులతో నిండిపోయింది. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు దంపతులు సముద్రునీకీ ప్రత్యేక పూజలు నిర్వహించి పుణ్యస్నానం ఆచరించారు.
లక్షమందికి పైగా పవిత్ర స్నానాలు ఆచరించడానికి రావడంతో హంసలదీవి ప్రాంతంలో వాహనాల రద్దీ నెలకొంది. పాలకాయ తిప్ప నుంచి సముద్రతీరం వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలీసులు కూడా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటుచేసారు.