కోర్టులో విచారణకు ముందే... ఇళ్ల కూల్చివేత: ఆత్మకూరులో ఉద్రిక్తత

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 

First Published Mar 22, 2021, 11:46 AM IST | Last Updated Mar 22, 2021, 11:46 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇరుపక్కల గల నివాసాలను మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. అయితే  గత నలభై సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని... ఇప్పుడు బలవంతంగా ఖాళీ చేయిస్తే తాము నిరాశ్రయులమై రోడ్డున పడతామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కూల్చేవేతలను వారు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయంపై బాధితులు గతంలోనే కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కాగా వారు వేసిన పిటిషన్ ఈరోజు కోర్టు లో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో కోర్టు విచారణ ప్రారంభానికి ముందే  బలవంతంగా తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.