ముళ్లకంచెలు, బారీకేడ్లతో... టిడిపి కేంద్ర కార్యాలయాన్ని చుట్టుముట్టిన పోలీసులు

అమరావతి : మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంతో పాటు పార్టీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు టిడిపి నాయకులు, కార్యకర్తలు సిద్దమయ్యారు. 

Share this Video

అమరావతి : మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంతో పాటు పార్టీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు టిడిపి నాయకులు, కార్యకర్తలు సిద్దమయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆందోళనకు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసులు ఇప్పటికే కీలక నాయకులను హౌస్ అరెస్టులు చేసారు. అలాగే ఉదయమే మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయానికి భారీగా చేరుకున్న పోలీసులు బారీకేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేసారు. పోలీసుల మొహరింపుతో ఉదయం నుండి టిడిపి కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.

Related Video