ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద... కృష్ణా పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తం

విజయవాడ : కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరగడంతో ప్రకాశం బ్యారేజీలోకి భారీగా నీరు చేరుతోంది.  

First Published Aug 31, 2022, 11:23 AM IST | Last Updated Aug 31, 2022, 11:23 AM IST

విజయవాడ : కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరగడంతో ప్రకాశం బ్యారేజీలోకి భారీగా నీరు చేరుతోంది.  ఈ బ్యారేజీ ఇన్ ప్లో 3లక్షల27వేల 692 క్యూసెక్కులుగా వుంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లే 20 గేట్లను 8 అడుగుల మేర, 50 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇలా బ్యారేజీలోంచి  3లక్షల 13 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు, 14,692 క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేస్తున్నారు. కృష్ణా నదికి వరద ఉదృతి, బ్యారేజీ నుండి నీటిని దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా వుండాలని అధికారులు హెచ్చరించారు.