NTR Satha Jayanthi Utsavalu : ప్రకాశం జిల్లాలో నందమూరి సుహాసినికి బ్రహ్మరథం
ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం కమ్మవారిపాలెంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నందమూరి సుహాసిని నివాళులు అర్పించారు.
ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం కమ్మవారిపాలెంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నందమూరి సుహాసిని నివాళులు అర్పించారు. ఆ తరువాత గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొని భారీ ర్యాలీ తో దారిపొడుగునా పూల వర్షం కురిపిస్తూ నందమూరి సుహాసినిని గజమాలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు దివి శివరాం, నియోజకవర్గ ఇన్చార్జి ఇంటూరి నాగేశ్వరావు, కమ్మ ప్రసాద్, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.