ఇళ్లముందు నిలిపిన బైక్స్ కి నిప్పంటించి... విజయవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం సృస్టించింది.  

First Published May 12, 2022, 4:28 PM IST | Last Updated May 12, 2022, 4:28 PM IST

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం సృస్టించింది.  కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబాడి పేటలో గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి ఇళ్ల ముందు నిలిపిన వాహనాలకు నిప్పంటించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇస్తున్నారనే ఇలా ద్విచక్ర వాహనాలు తగులబెట్టారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఐదు బైక్ లకు నిప్పంటించగా పూర్తిగా దగ్దమయ్యాయి. నగర శివారు ప్రాంతం కావడంతో ప్రతి రోజు లంబాడిపేట ప్రాంతంలో యువత గంజాయి మత్తులో జోగుతున్నారని భయానక వాతావరణం సృష్టిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. తాజా బైక్స్ దగ్దం ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపేట పోలీసులు తెలిపారు.