మూడు రాజధానులు జగన్ పర్సనల్ ఎజెండా మాత్రమే : కొల్లు రవీంద్ర
మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ప్రెస్ మీట్ పెట్టారు. వీరు మాట్లాడుతూ మూడు రాజధానులు జగన్ సొంత అజెండా మాత్రమేనని ఎద్దేవా చేశారు. ప్రజాభిష్టం మేరకు పెద్దల సభలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించారన్నాడు. శాసనమండలి రద్దు జగన్ అహంభావానికి నిలువెత్తు నిదర్శనం అని మండిపడ్డారు. శాసనమండలిలో మంత్రులు ప్రవర్తించిన తీరు ముక్కున వేలు వేసుకునేలా ఉందని, మండలి చైర్మన్, టీడీపీ ఎమ్మెల్సీలను ప్రభావితం చేసేలా మంత్రులు వ్యవహరించారని అన్నారు. రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడం చారిత్రక విజయం అన్నారు.