
కూటమి పాలనలో పాడి రైతుల ఆక్రందనలు: మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజు
ఆంధ్రప్రదేశ్‌లో పాడి పరిశ్రమను ప్రైవేటు డెయిరీలు భ్రష్టుపట్టిస్తున్న కూటమి సర్కార్ చేష్టలూడి చూస్తోందని వైయస్ఆర్‌సీపీ వైద్య విభాగం అధ్యక్షుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. శ్రీకాకుళం వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాల ధరలు పతనమై పాడి రైతులు ఆక్రందనలు పెడుతున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు డెయిరీల దోపిడీకి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని ధ్వజమెత్తారు.