రైతులకు రూ.20వేలు.. పథకం అప్పటి నుంచి అమలులోకి..: మంత్రి అచ్చెన్నాయుడు | Asianet News Telugu
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులని ముంచేసిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కేవలం రైతు భరోసా కింద ఏడాదికి రూ.7,500 ఇచ్చి.. మిగతా పథకాలన్నీ ఆపేశారని విమర్శించారు. పొలాల్లో భూసార పరీక్షలు గానీ, రైతులకు రాయితీపై యంత్రాల పంపిణీ గానీ, 9ం శాతం రాయితీతో ఇచ్చే డ్రిప్ పరికరాలు గానీ ఇవ్వలేదన్నారు. పైగా ఒక్క ఏడాది కూడా పూర్తిగా పంటల బీమా చెల్లించలేదని, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన రైతులందరికీ ఏడాదికి ఏడాదికి రూ.20 వేలు అందిస్తుందని స్పష్టం చేశారు. త్వరలోనే ఆ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.