
నేను ఎందుకు ఓడిపోయానంటే.. లైవ్ లో ఏడ్చేసిన మాజీ మంత్రి విడదల రజనీ
ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌కు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం ఇచ్చి గౌరవించిందే తప్ప ఏనాడు నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని మాజీ మంత్రి విడదల రజనీ స్పష్టం చేశారు. చిలకలూరిపేట క్యాంప్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. పార్టీ కష్టసమయంలో అండగా నిలవాల్సింది పోయి రాజీనామా చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి మేలు చేసేలా ఆయన వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణమన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచక పాలన సాగిస్తున్న కూటమి సర్కార్‌పై ప్రతిపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్ మాట్లాడి ఉంటే ఆయనకు ప్రజల్లో మరింత గౌరవం, మర్యాదలు పెరిగేవన్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలను విడదల రజనీ ఖండించారు. తమ నాయకుడు ఎవరినీ మోసం చేయలేదని.. మంచి చేసి ఓడిపోయారని చెప్పారు.