ప.గో జిల్లాలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం... దళిత సంఘాల ఆందోళన...
తణుకు : రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బాబా సాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తణుకు : రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బాబా సాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో పాఠశాల ప్రాంగణంలో గల అంబేద్కర్ విగ్రహాన్ని అర్థరాత్రి దుండుగులు ధ్వంసం చేసారు. విగ్రహం తలను తొలగించి పక్కనే వున్న చెరువులో పడేసినట్లు సమాచారం. విగ్రహ ధ్వంసం ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.
బిఆర్ అంబేద్కర్ విగ్రహ ధ్వంసం గురించి తెలిసి ముద్దాపురం ప్రజలే కాదు చుట్టుపక్కల గ్రామాల దళితులు సైతం పాఠశాలకు చేరుకుంటున్నారు. ఇక ముద్దాపురం యువకులు పాఠశాల ఆవరణలోనే టెంట్ వేసుకుని నిరసనకు దిగారు. వివాదం పెద్దది కాకముందే నిందితులకు గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.