పెట్రోల్ బంకుల్లో నీలి కిరోసిన్ మిక్స్ ...స్వయంగా దాడులు చేసి పట్టుకున్న జిల్లా ఎస్పి
ఆళ్లగడ్డ పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల్లో కిరోసిన్ మిక్స్ చేసి అమ్ముతున్నారు అన్న సమాచారం తో కర్నూల్ జిల్లా ఎస్.పి పట్టణంలోని హెచ్ .పి.,ఇండియన్ పెట్రోల్ బంకుల పై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో కర్ణాటక నుంచి వచ్చిన 12 వేల లీటర్లు బ్లూ కిరోసిన్ను స్వాధీనం చేసుకున్నారు.
ఆళ్లగడ్డ పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల్లో కిరోసిన్ మిక్స్ చేసి అమ్ముతున్నారు అన్న సమాచారం తో కర్నూల్ జిల్లా ఎస్.పి పట్టణంలోని హెచ్ .పి.,ఇండియన్ పెట్రోల్ బంకుల పై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో కర్ణాటక నుంచి వచ్చిన 12 వేల లీటర్లు బ్లూ కిరోసిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ పక్కిరప్పా మాట్లాడుతూ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లో కిరోసిన్ కల్తీ చేసి అమ్ముతున్నారని రాబడిన సమాచారం మేరకు దాడులు నిర్వహించడం జరిగింది ఈ దాడుల్లో 12 వేల లీటర్ల కిరోసిన్ ట్యాంకర్ ను సీజ్ చేశామని కిరోసిన్ డీజిల్ ను శాంపిల్స్ తీసుకున్నామని రెండు మిక్స్ అయినట్లు తెలిస్తే పెట్రోల్ బంకులను సీజ్ చేస్తామని పెట్రోల్ బంకు యజమానుల పై కేసు నమోదు చేస్తామని తెలిపారు