దిశా యాప్ ఉంటే ఇన్ని దారుణాలు జరిగేవా?: వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి | Asianet News Telugu
రాజమహేంద్రవరంలో ఆత్మహత్యా యత్నం చేసిన ఫార్మసీ విద్యార్థిని నాగ అంజలి, 12 రోజుల తర్వాత దుర్మరణానికి ప్రభుత్వమే కారణమని ఎమ్మెల్సీ, వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన దీపక్ ఏజీఎంగా ఉన్న ఆస్పత్రిలోనే అంజలికి చికిత్స చేయొద్దని, వేరే ఆస్పత్రికి తరలించాలని కోరినా.. ఆమె తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పినా.. ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. చివరికి 12 రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎవరూ కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. దిశా యాప్ ఉంటే ఇలాంటి దారుణాలు జరిగేవా అని ప్రశ్నించారు.