సిగ్గులేదా.. ఒక్క కౌన్సిలర్ కూడా లేకుండా పిడుగురాళ్ల వైస్ చైర్మన్ గెలిచారా? YS Jagan |Asianet Telugu
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో పర్యటించారు. విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. జగన్ వెంట వైసీపీ నాయకులు కొడాలి నాని, తలశిల రఘురాం తదితరులు ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకొని జై జగన్, సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ములాఖత్ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ ఏ తప్పు చేయలేదని చెప్పారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. ఒక్క కౌన్సిలర్ కూడా లేకుండానే పిడుగురాళ్ల వైస్ చైర్మన్ పదవి టీడీపీ వాళ్లు ఎలా గెలిచారని ప్రశ్నించారు.