దేశం అద్భుతంగా మారాలంటే ఈ పనిచేయండి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ | Asianet News Telugu
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ పేరిట నిర్వహించే ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా నంబూరులో ప్రారంభించారు ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. దేశం గొప్పగా ముందుకు సాగాలంటే శుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుచూపుతో చేపట్టే కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు.