Deputy CM Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Share this Video

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.20.77 కోట్ల అంచనా వ్యయంతో కొబ్బరి రైతులకు ఉపశమనం కలిగించేలా చేపట్టనున్న ఈ పనుల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. 45 రోజుల్లో సమస్య పరిష్కరిస్తానన్న హామీని నిలబెట్టుకుంటూ, 35 రోజుల్లోనే సమస్యకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు కోనసీమ ప్రజల్లో హర్షం కలిగించాయి.

Related Video