నకిలీ పురుగుమందుతో నష్టపోయిన రైతులు... 120 ఎకరాల్లో పంట నష్టం

గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెం, గంగదేవరపాడు గ్రామంలో నకిలీ పురుగు మందులు వాడటం ద్వారా తీవ్ర పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. 

| Updated : Apr 30 2023, 04:07 PM
Share this Video

గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెం, గంగదేవరపాడు గ్రామంలో నకిలీ పురుగు మందులు వాడటం ద్వారా తీవ్ర పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. సుమారు 100 నుండి 120 ఎకరాల్లో పంటను నష్టపోయామని...  అమ్మిరెడ్డిగూడెం గ్రామంలో ఉన్న జై హనుమాన్ ఫెస్టిసైడ్స్ &సీడ్స్ షాపులో కోరాజెన్ అనే మందు వాడటం వల్లనే తమకు తీవ్ర పంట నష్టం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేసారు. అప్పటి వరకు బాగా ఉన్న వరి పొలాలు ఆ మందు వాడిన తర్వాత కుశించిపోయాయని, ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి 50 నుండి 55 బస్తాలు వరకు దిగుమతి వచ్చేదని... కానీ ఈ సంవత్సరం నకిలీ కోరాజెన్ మందు వాడటం వల్లన ఒక ఎకరానికి 4 నుండి 5 బస్తాలు అవ్వటం కూడా కష్టంగా మారిందని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. 

Related Video