
Adulterated Milk: రాజమహేంద్రవరం పాల కల్తీ పై జిల్లా కలెక్టర్ కీలక ప్రెస్ మీట్
చౌడేశ్వరినగర్, స్వరూప్‌నగర్ ప్రాంతాల్లో కిడ్నీ సంబంధిత కేసులు నమోదైన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని కలెక్టర్ తెలిపారు. జిల్లా పరిపాలన, వైద్య ఆరోగ్య, ఆహార భద్రత, పోలీసు, రెవెన్యూ, పశుసంవర్థక శాఖలు మరియు మున్సిపల్ అధికారులు సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బృందాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహిస్తూ అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నారు.