కరోనా వైద్యానికి లక్షలకు లక్షలు... ప్రైవేట్ హాస్పిటల్స్ పై జగన్ సీరియస్
అమరావతి: కరోనా కష్టకాలంలో వైద్యం పేరుతో ప్రజలను ముఖ్యంగా నిరుపేదలను దోచుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యవహారశైలిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.
అమరావతి: కరోనా కష్టకాలంలో వైద్యం పేరుతో ప్రజలను ముఖ్యంగా నిరుపేదలను దోచుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యవహారశైలిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. అవకతవకలకు పాల్పడే ప్రైవేట్ ఆసుపత్రులపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే నేరుగా తనకే నివేదిక అందించాలని సీఎం సూచించారు. మొదటిసారి తప్పు చేస్తే జరిమానా విధించాలని.. మళ్లీ మళ్లీ తప్పు చేస్తే కేసులు పెట్టాలని సీఎం అన్నారు.
స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. తరచూ అవకతవకలకు పాల్పడే ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు పెట్టాలని జగన్ ఆదేశించారు.