కరోనా థర్డ్ వేవ్ పై సర్కార్ అప్రమత్తం... అధికారులకు జగన్ కీలక ఆదేశాలు

అమరావతి: కరోనా థర్డ్ వేవ్ చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావాన్ని చూపించనుందన్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే అప్రమత్తం అవుతోంది. వి.విజయరామరాజు, ఏపీ హెల్త్ సిస్టం స్ట్రెంగ్తనింగ్ ప్రాజెక్టు (ఏపీహెచ్‌ఎస్‌ఎస్‌పి) పీడీ డాక్టర్ వి.వినోద్ కుమార్‌, ఆయుష్‌ కమిషనర్‌ వి.రాములుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 

First Published Jun 7, 2021, 4:21 PM IST | Last Updated Jun 7, 2021, 4:21 PM IST

అమరావతి: కరోనా థర్డ్ వేవ్ చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావాన్ని చూపించనుందన్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే అప్రమత్తం అవుతోంది. సోమవారం కోవిడ్‌19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం జగన్‌ పీడియాట్రిక్ వార్డుల ఏర్పాటుపై చర్చించారు. వెంటనే ప్రతి హాస్పిటల్లో పీడియాట్రిక్ వార్డు వుండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 

ఈ సమీక్షా నమావేశంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం.టీ.కృష్ణబాబు, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ మరియు వాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లిఖార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, ఏపీ హెల్త్ సిస్టం స్ట్రెంగ్తనింగ్ ప్రాజెక్టు (ఏపీహెచ్‌ఎస్‌ఎస్‌పి) పీడీ డాక్టర్ వి.వినోద్ కుమార్‌, ఆయుష్‌ కమిషనర్‌ వి.రాములుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.