
CM Chandrababu Speech: తిరుపతి వెడ్డింగ్ హబ్ గా తయారవుతుంది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిని వెడ్డింగ్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. వివాహ వేడుకలు, పర్యాటకం, హోటల్ రంగం అభివృద్ధికి ఈ ప్రణాళిక దోహదపడుతుందని సీఎం తెలిపారు. తిరుపతి నగరానికి కొత్త గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చంద్రబాబు స్పష్టం చేశారు.