
Smart Kitchen Project for Schools
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యతను మరింత మెరుగుపరచేందుకు చేపట్టిన స్మార్ట్ కిచెన్ ఫర్ ఆల్ ది స్కూల్స్ ప్రాజెక్ట్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ వినూత్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు కడప జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి అభినందించారు.విద్యార్థులకు పరిశుభ్రమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించడమే లక్ష్యంగా అమరావతిలో ఈ ప్రాజెక్ట్‌పై సమీక్ష నిర్వహించారు.