
CM Chandrababu Speech: తెలుగు రాష్ట్రాల మధ్య సమైక్యత అవసరం: సీఎం
గుంటూరులో నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వేదికపై ఏర్పాటు చేసిన తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తపాలా శాఖ విడుదల చేసిన ప్రత్యేక కవర్‌ను సీఎం ఆవిష్కరించారు. అనంతరం తెలుగు మహాసభలను ఉద్దేశించి ప్రసంగించారు.