
తందనానా–2025’ విజేతలకు సీఎం చంద్రబాబు బంగారు పతకాలు
సంగీతం, సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కళాకారుల ద్వారా అన్నమయ్య కీర్తనలను ప్రజలకు చేరవేస్తున్న డాక్టర్ శోభారాజు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని తెలిపారు.అన్నమయ్య అంతర్జాతీయ సంకీర్తన పోటీలు **‘తందనానా–2025’**లో విజేతలైన ముగ్గురు గాయనీ గాయకులకు ముఖ్యమంత్రి బంగారు పతకాలను ప్రదానం చేశారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులు అందజేశారు.