అరసవల్లి దేవాలయంలో తోపులాట.. పోలీసులతో భక్తుల వాగ్వాదం..

శ్రీకాకుళం : అరసవల్లి దేవాలయంలో రథ సప్తమి సందర్భంగా భక్తులు పోటెత్తారు.

First Published Jan 28, 2023, 2:46 PM IST | Last Updated Jan 28, 2023, 2:46 PM IST

శ్రీకాకుళం : అరసవల్లి దేవాలయంలో రథ సప్తమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. పోలీసులకు భక్తులకు మధ్య తోపులాట జరిగింది.  రూ. 500 టికెట్ తీసుకున్నా కూడా తమను క్యూ లైన్లో ఎదురుచూసేలా చూడడం ఏంటీ? ఏంటి అన్యాయం  అంటూ మండిపడ్డారు.  ఈఓ ఎక్కడ ఉన్నా వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.500 టికెట్ కి భక్తులకు దర్శనం చేసుకోవాల్సిన 5 గంటల సమయం వీఐపీలను పంపుతున్న తరుణంలో ఈ వివాదం చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో వెలుగుల రేడు జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ కమీషనర్ హరిజవహర్ లాల్ ఈ వేడుకలకు అంకురార్పణ చేసి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  అనంతరం క్షీరాభిషేకం నిర్వహించి ఆదిత్యుని నిజరూపానికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. ఈ ఉత్సవాలను సంప్రదాయ బద్దంగా జరిపించడానికి జిల్లా యంత్రంగం అన్ని ఏర్పాట్లను చేసింది. రధసప్తమి రోజున స్వామి వారిని దర్శించుకుంటే రోగ శోక బాధలన్నీ తొలిగిపోతాయని భక్తుల విశ్వాసం.