Video : స్టీల్ ప్లాంటును కాపాడుకోవడానికి బస్సులను ఆపేశారు...
విశాఖ, గాజువాకలోని స్టీల్ సిటీ ఆర్టీసీ డిపో వద్ద ఈ రోజు ఉదయం కాసేపు హంగామా జరిగింది.
విశాఖ, గాజువాకలోని స్టీల్ సిటీ ఆర్టీసీ డిపో వద్ద ఈ రోజు ఉదయం కాసేపు హంగామా జరిగింది. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్టీల్ సిటీ ఆర్టీసీ డిపో వద్ద స్టీల్ ప్లాంట్ యూనియన్ సిఐటియు వైస్ ప్రెసిడెంట్ మారుతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నలుగురు వ్యక్తులు ఆర్టీసీ బస్సులను బయటకు వెళ్లకుండా ఆపారు. విషయం తెలిసిన దువ్వాడ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.