Asianet News TeluguAsianet News Telugu

ఇదీ చిరంజీవి పవర్... ఇప్పటికైనా అర్థమయ్యిందా..?: కొడాలి నానిపై రాము సెటైర్లు

గుడివాడ : ఆంధ్ర ప్రదేశ్ లో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా చేస్తున్నారు. 

First Published Aug 22, 2023, 5:23 PM IST | Last Updated Aug 22, 2023, 5:23 PM IST

గుడివాడ : ఆంధ్ర ప్రదేశ్ లో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా చేస్తున్నారు. ఇలా గుడివాడలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని పాల్గొని అందరినీ ఆశ్చర్యపర్చడమే కాదు చిరంజీవిని పొగుడుతూ మాట్లాడారు. ఇటీవల పకోడిగాళ్లు అంటూ చేసిన వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్దేశించి కాదంటూ నాని యూటర్న్ తీసుకున్నారు. ఈ క్రమంలో నానికి టిడిపి నేత వెనిగండ్ల రాము కౌంటర్ ఇచ్చారు. 

చిరంజీవి ఎంత పవర్ ఫుల్ మనిషో కొందరికి ఇప్పుడు అర్థమైనట్లుంది... ఇన్నాళ్లకు జ్ఞానోదయం అయినట్లుంది అని రాము అన్నారు. ఇటీవల చిరంజీవిపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన వారు ఇప్పుడు ఆ తప్పు తెలుసుకొని లెంపలు వేసుకుంటున్నారని అన్నారు. చిరంజీవిపై విమర్శలు చేయలేదు బాబు అంటూ కాళ్లు పట్టుకునే స్థాయికి వచ్చారంటూ పరోక్షంగా కొడాలి నానిపై వెనిగండ్ల రాము సెటైర్లు వేసారు.