
Chandrababu: స్వర్ణ నారావారిపల్లెకు శ్రీకారం చుట్టాం.. జీవనప్రమాణాలు పెంచాలి
స్వర్ణ నారావారిపల్లె అభివృద్ధికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల జీవనప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, విద్య, ఆరోగ్యం వంటి అంశాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తన ప్రసంగంలో సీఎం వెల్లడించారు.