
ఢిల్లీలో కొత్త యుగం ప్రారంభం: చంద్రబాబు
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాంలీల మైదానంలో అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏపీ నుంచి సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 20న ఢిల్లీలో కొత్త యుగం ప్రారంభమైందన్నారు. మనం ఢిల్లీలో కొత్త మార్పును చూడబోతున్నామని.. ఇప్పటి నుంచి భిన్నమైన ఢిల్లీని చూసి ప్రతి పౌరుడు గర్వపడతాడన్నారు.