నారా దేవాన్ష్ బర్త్ డే...తిరుమలలో ప్రసాదాలు వడ్డించిన చంద్రబాబు కుటుంబ సభ్యులు| Asianet News Telugu
మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో సీఎం చంద్రబాబు కుటుంబానికి వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఆ తర్వాత తరిగొండ వెంగమాంబ అన్నవితరణ కేంద్రంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాదాలు వడ్డించారు. రూ.44 లక్షలు విరాళంగా అందించి భక్తులకు అన్నదానం చేశారు