Asianet News TeluguAsianet News Telugu

కాళ్లుచేతులు పట్టి ఈడ్చుకెళ్ళి... విశాఖలో టిడిపి మహిళల అరెస్ట్

విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా టిడిపి ఆందోళనలు చేపడుతోంది.

First Published Sep 13, 2023, 5:07 PM IST | Last Updated Sep 13, 2023, 5:07 PM IST

విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా టిడిపి ఆందోళనలు చేపడుతోంది. ఇలా విశాఖపట్నంలో ఆందోళనకు సిద్దమవుతున్న టిడిపి మహిళా నాయకులను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. అలాగే విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ఱబాబును కూడా పోలీసులు బలవంతంగా తమ వాహనం ఎక్కించారు. ఇలా టిడిపి నాయకులకు అరెస్టులతో జివిఎంసి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి శాంతియుత నిరసనకు సిద్దమైన తమను పోలీసులు అడ్డుకోవడం దారుణమని టిడిపి నాయకులు అంటున్నారు.