బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
విజయవాడ: ఆషాడ మాసం బోనాల పండగ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడిలో అంగరంగ వైభవంగా జరిగింది.
విజయవాడ: ఆషాడ మాసం బోనాల పండగ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడిలో అంగరంగ వైభవంగా జరిగింది. విజయవాడ దేవాలయం, భాగ్యనగర మహాంకాళి ఆలయాల ఉమ్మడి ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. ఈ ఉత్సవం అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగింది.
ఆషాడ మాసం బోనాల ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ లో కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు. ఉత్సవాల్లో భాగంగా బోనాలను సమర్పణతో పాటు నిర్వాహకులు, భక్తులు, కళాకారులు, పోతురాజుల విన్యాసాలతో విజయవాడ బ్రహ్మణ వీధి నుంచి కళాకారుల నృత్యాలతో దేవాలయానికి సామూహిక ఊరేగింపు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బోనాల ఉత్సవ కమిటి సభ్యులు, దేవాలయం ఈవో, ఆలయ కమిటి చైర్మన్లతో పాటు అధికారులు ఉన్నారు.