ఉన్మాద భక్తి: వయసొచ్చిన కూతుళ్లను చంపిన తల్లి, తండ్రి సాక్షి
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది.
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. క్షుద్రపూజలు చేసి తల్లిదండ్రులు తమ ఇద్దరు కూతుళ్లను అత్యంత దారుణంగా చంపేశారు. తల్లిదండ్రులు విద్యావంతులే. కానీ క్షుద్రపూజల మాయలో పడి ఇద్దరు కూతుళ్లను మట్టుబెట్టారు. చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీలో గల శివనగర్ లో ఆదివారం రాత్రి ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు అందించారు.