
Bhumana Karunakar Reddy Comments: తిరుమలలో మద్యం సీసాల అంశంపై భూమన ఫైర్
తిరుమల తిరుపతి పవిత్రత మరోసారి అపవిత్రతకు గురైందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కొండపై కౌస్తబం విశ్రాంతి గృహం వద్ద ఖాళీ మద్యం బాటిళ్లు లభ్యమైన ఘటనను ఆయన ఖండించారు. గత 6 నెలలుగా తిరుమలలో జరుగుతున్న అపచారాలను ప్రజల దృష్టికి తీసుకువస్తున్నా, టీటీడీ పాలక మండలి చర్యలు శూన్యమని భూమన ఆరోపించారు.